Home / MOVIES / బిగ్‌బాస్‌ నుంచి ఒకేసారి ఇద్దరు ఎలిమినేట్‌..రాహుల్‌ వెళ్లడంతో ఏడుస్తున్నపునర్నవి

బిగ్‌బాస్‌ నుంచి ఒకేసారి ఇద్దరు ఎలిమినేట్‌..రాహుల్‌ వెళ్లడంతో ఏడుస్తున్నపునర్నవి

బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కే కాదు.. చూసే వీక్షకులకు కూడా ఇది పెద్ద షాకే. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది ముగ్గురే .. అయితే అందులోంచి ఇద్దర్నీ ఒకేసారి ఎలిమినేట్‌ చేయనున్నట్లు తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రోమో రిలీజ్‌ చేయలేదని బాధపడిన వారికి..బిగ్ బాస్ డబుల్‌ డోస్‌ ఇచ్చేశాడు . అయితే ఈ ప్రోమోను చూస్తుంటే ఎలిమినేట్‌ అయింది రాహుల్‌, హిమజ అని తెలుస్తోంది. రాహుల్‌ వెళ్లడంతో పునర్నవి ఏడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక నేను ఎవరిని తిట్టాలి.. నాకున్న బెస్ట్‌ ఫ్రెండ్‌ అని పున్ను తెగ బాధపడిపోతోంది. మహేష్‌ కెప్టెన్‌ అయిన కారణంగా ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.