Home / MOVIES / యువతిని వేధించిన హీరో

యువతిని వేధించిన హీరో

దారిన బస్సు కోసం ఎదురుచూస్తున్న ఒక యువతిని ప్రేమించమని వేధించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కన్నడ సినీ హీరో ,నిర్మాత హుచ్చ వెంకట్ గత కొద్ది రోజుల కింద సకలేశపుర,కొడగు,మైసూరు తదితర ప్రాంతాల్లో పబ్లిక్ గా మిస్ బీహేవర్ చేసి వార్తల్లోకి ఎక్కాడు.

తాజాగా శుక్రవారం హిందూపురం – యలహంక రహదారి మధ్య ఉన్న మారసంద్ర టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించాడు. టోల్ గేట్ దగ్గర బస్సు కోసం ఎదురు చూస్తున్న ఒక యువతి పట్ల మిస్ బీహేవర్ చేస్తూ ప్రేమించమని వేధించాడు.

దీంతో భయపడిన ఆ యువతి అక్కడ నుంచి పారిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో నటున్ని అరెస్టు చేసి తీసుకెళ్లారు.