Home / MOVIES / పట్టుమని పాతికేళ్లు కూడా నిండకముందే ప్రేమపాఠాలతో పాటు పెళ్లి..టాలీవుడ్ హీరోయిన్

పట్టుమని పాతికేళ్లు కూడా నిండకముందే ప్రేమపాఠాలతో పాటు పెళ్లి..టాలీవుడ్ హీరోయిన్

ఇటీవలే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఓ స్టార్ డాటర్.. ఇంకా సెకండ్ మూవీకి కూడా కమిట్ అవ్వకముందే లవ్‌లో మాత్రం కమిట్మెంట్ ఇచ్చేసిందట. అంతేకాదు అప్పుడే పెళ్లిమాటలు కూడా చెపుతోంది ఆ క్యూట్ గర్ల్. ఆ హీరోయిన్ ఎవరంటే ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్, అలనాటి నటి లిజి ముద్దుల కూతురు కల్యాణి. రెండేళ్ల క్రితం ‘హలో’ చిత్రంతో టాలీవుడ్ కు కల్యాణి పరిచయమైంది. అయితే స్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ తో కళ్యాణి అప్పుడే లవ్ సెట్ చేసుకుందట. మోహన్ లాల్, ప్రియదర్శన్ లు కాలేజీ రోజుల నుంచే మంచి స్నేహితులు. వీరి స్నేహం అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ప్రణవ్, కల్యాణి లకు కూడా చిన్నప్పటి నుంచే స్నేహం ఉంది. ఇప్పుడు అది లవ్ ట్రాక్ పైకి ఎక్కింది.

తనపై వస్తున్న ప్రేమ వార్తలపై కల్యాణి ఇటీవల స్పందిస్తూ… తాను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్న మాట నిజమేనని తెలిపింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. తమ ప్రేమ వ్యవహారం తన కుటుంబసభ్యులకు కూడా తెలుసని చెప్పింది. తన ప్రియుడి పేరు, వివరాలను ఇప్పుడు చెప్పనని తెలిపింది. తమ ప్రేమకు ఎలాంటి సమస్య లేదని చెప్పింది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat