Home / ANDHRAPRADESH / తండ్రికి తగ్గ తనయుడు..వైఎస్ఆర్ తరహాలోనే పేదల గృహాలలో వెలుగు నింపిన జగన్..!    

తండ్రికి తగ్గ తనయుడు..వైఎస్ఆర్ తరహాలోనే పేదల గృహాలలో వెలుగు నింపిన జగన్..!    

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కంటి వెలుగుతో 70 లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని వైసీపీ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యులు కోనూరు సతీష్ శర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అందత్వ రహిత రాష్ట్రంగా ఉంచాలనే సంకల్పంతో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. నేటి విద్యార్థులే రేపటి తరానికి మార్గదర్శకులని, వారు కంటి చూపుకు దూరం కాకుండా ముందుగా పాటశాల విద్యార్థులకు  ఉచిత పరీక్షలు, అవసరమైతే చికిత్సలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనన్నారు. జగన్మోహన్ రెడ్డి ముందుచూపు, ప్రభుత్వ పథకాల వల్ల జరుగుతున్న లబ్ది చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ సోషల్ మీడియా వేదికగా చేసుకొని చంద్రబాబు దళం చేస్తున్న విషప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. నామినేటెడ్ పదవులలోను,నామినేషన్ పనులలోను ,కాంట్రాక్టులలోను,మహిళలకు 50%శాతం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అని పేర్కొన్నారు. లక్షల మంది నిరుద్యోగులకు వాలంటీర్లు గ్రామ సచివాలయంలో ఉద్యోగాల పండుగ జరుగుతుంటే చూసి తట్టుకోలేక చంద్రబాబు వాలంటీర్ల గురించి అసభ్యకరంగా మాట్లాడిన మాటలు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.