Home / SLIDER / చర్చలకు ఆహ్వానిస్తే మేము సిద్ధం-ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి

చర్చలకు ఆహ్వానిస్తే మేము సిద్ధం-ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సిబ్బంది గత పదిరోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ,పార్లమెంటరీ నేత కేకే ఆర్టీసీ సిబ్బంది ఆలోచించాలి. సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలి. ఇప్పటి వరకు తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ నేతలు కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎక్కడా చెప్పలేదు.

అలా చేయాల్సి వస్తే ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాల్సి వస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీ సిబ్బందికి నలబై నాలుగు శాతం ఫిట్మెంట్, పదహారు శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది. సిబ్బంది చర్చలకు రెడీ అయితే నేను మధ్యవర్తిత్వం వహిస్తాను అని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి స్పందించారు.

ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ సీనియర్ నేత,పార్లమెంటరీ నేత కేకే అంటే మాకు గౌరవం ఉంది.నాడు ఉద్యమం సమయంలో ఎంతో కృషి చేశారు.కేకే మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదే.ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తిస్తామని హామీకి కట్టుబడి ఉండాలి.సీనియర్ నేత కేకే చర్చలకు ఆహ్వానిస్తే మేము చర్చలకు రావడానికి సిద్దం.

అయితే కొద్ది మంది మంత్రులు కార్మికులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆర్టీసీ జెఎసి నాయకులు ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు.టీఎన్జీవో నేతలకు ఆర్టీసీ సమ్మె గురించి చెప్పలేదనడం సరికాదు.ఉద్యోగ సంఘాల నేతలపై మాకు నమ్మకం ఉంది అని అన్నారు అని వార్తలు వస్తున్నాయి.