Home / MOVIES / మహేష్ ను ఇబ్బంది పెడుతున్న అగ్ర దర్శకుడు

మహేష్ ను ఇబ్బంది పెడుతున్న అగ్ర దర్శకుడు

టాలీవుడ్ స్టార్ హీరో ,ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ హీరో స్థాయికెదిగారు. ఒకవైపు విజయవంతమైన సినిమాలతో.. మరోవైపు సమాజానికి సందేశాలను ఇస్తూ చిత్రాల్లో నటిస్తూ వరుస చిత్రాలను చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న చిత్రం రానున్న సంక్రాంతికి విడుదల కానున్నది. ఆ తర్వాత ఏ మూవీ సెట్ పైకి వస్తుందో ఆయన అభిమానులతో పాటు.. తెలుగు సినిమా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న తరుణంలో జక్కన్న దర్శకత్వంలో ఒక భారీ చిత్రం చేయబోతున్నారు అని వార్తలు గుప్పుమన్నాయి.

అయితే మరో వైపు జక్కన్న ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని మొదట వచ్చే ఏడాది జూలైలో విడుదల చేయాలని భావించిన కానీ ఇందులో ప్రధాన పాత్రదారులైన జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ తేజ్ డేట్స్ కుదరకపోవడంతో మరో ఏడాదికి వాయిదా పడుతుంది. దీంతో ఎప్పటి నుంచో ఎస్ ఎస్ రాజమౌళితో మూవీ చేయాలని ఎదురుచూస్తున్న మహేష్ నిరీక్షణ మరో ఏడాదికి పెరిగిపోయింది.

దీంతో మహేష్ తెగ బాధపడుతున్నాడు అని సమాచారం. తాను డేట్స్ ఇస్తే ఇప్పటికిప్పుడు కథలు రెడీ చేయడానికి దర్శకులు.. సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు క్యూ కడుతున్న తరుణంలో జక్కన్న ఇలా ఇబ్బందులకు గురి చేయడం మహేష్ అభిమానులను తెగ కలవరపెడుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి మహేష్ నిరీక్షణను ఎంత త్వరగా జక్కన్న తెర దించుతాడో..!