Home / MOVIES / “మా” లో ముదిరిన వివాదాలు

“మా” లో ముదిరిన వివాదాలు

మరోసారి తెలుగు సినిమాలో గొడవ జరుగుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రముఖ నటులు నరేష్ కు జీవిత ,రాజశేఖర్ లకు మధ్య వివాదం సాగుతోంది.తాజాగా మా అద్యక్షుడు నరేష్ తో సంబంధం లేకుండా జీవిత,రాజశేఖర్ లు జనరల్ బాడీ పేరుతో సమావేశం పెట్టడంపై నరేష్ లాయర్ అభ్యంతరం చెప్పారు.మా లో ఉన్న మూల ధనం ఐదు కోట్ల రూపాయలు ఏమయ్యాయని జీవిత ,రాజశేఖర్ లు ప్రశ్నించారని కథనాలు వస్తున్నాయి.

మా లో రాజశేఖర్ ఉపాధ్యక్షుడుగాను, జీవిత కార్యదర్శిగా ఉన్నారు.తాము అధికారికంగా సమావేశం పెట్టలేదు.జనరల్ బాడీ మీటింగ్ కాదని జీవిత ,రాజశేఖర్ లు చెబుతున్నారు. కాగా సమావేశంలో రెండువర్గాల మద్య వివాదం అరుపులతో సాగిందని అంటున్నారు. నటుడు పృద్వీరాజ్ మాట్లాడుతూ ఈ బాడీని రద్దు చేయాలని కోరుతున్నానని అన్నారు.కొందరు నియంతృత్వ పోకడలు పోతున్నారని ఆయన అన్నారు.జీవిత ,రాజశేఖర్ లు ఆర్టిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.