ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ” రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్నందున ఉపాధి కోల్పోయిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నెలకు రూ.10వేలను సాయంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇసుక నియంత్రణ పేరుతో అధికార పార్టీ అయిన వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు.సొంత ఊర్లల్లో వాగు ఇసుకను తీసుకెళ్లడానికి కూడా అనుమతులు కావాలని చెప్పడం స్థానికులకు అగ్రహాం తెప్పిస్తుందని ఆయన అన్నారు.