Home / NATIONAL / కేంద్ర మంత్రులు అలా మాట్లాడోద్దు

కేంద్ర మంత్రులు అలా మాట్లాడోద్దు

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ కేంద్ర మంత్రులకు పలు సూచనలు.. సలహాలు ఇచ్చారు. దేశంలోనే సంచలనం సృష్టిస్తోన్న ఆయోధ్యపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు నుంచి తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ” ఆయోధ్య తీర్పుపై కేంద్ర మంత్రులు కానీ సహాయ మంత్రులు కానీ అనవసర వ్యాఖ్యలు చేయద్దు.

ఈ అంశంపై వివాదస్పద వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తపడాలి. మీడియా సమావేశంలో ఆలోచించి మాట్లాడాలని”ప్రధాని కేంద్ర మంత్రులకు సూచించారు. ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరికీ శాంతి భద్రతలను కాపాడే బాధ్యత ఉందని ప్రధాని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సుప్రీం కోర్టు నుంచి తీర్పు రాగానే గెలుపు,ఓటమిలంటూ ప్రస్తావన రావద్దు అని ఆయన మంత్రులకు సూచించారు.