వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, విశాఖపట్నం ఎంపీ విజయసాయిరెడ్డి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసిపి నేత ఆమంచి కృష్ణమోహన్ తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. విజయసాయిరెడ్డి వయసు 60 ఏళ్లు ఉందని, భారత దేశంలోనే అత్యుత్తమ ఆడిటర్లలో ఆయన కూడా ఒకరని, వైఎస్ కుటుంబానికి ఆయన ఆడిటర్ గా పనిచేశారనిఆమంచి చెప్పుకొచ్చారు. అయితే తాను ఎంతో త్యాగం చేశాం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అసలు ఏం త్యాగం చేశాడు అని ప్రశ్నించారు. పవన్ నువ్వు మేకప్ వేసుకుంటే హీరో మేకప్ తీసేస్తే జీరో అంతే తప్ప ఇంకా ఏమీ త్యాగం చేయలేదు కదా అని ప్రశ్నించారు.. రోజూ మందు తాగడం అమ్మాయిలతో తిరగడం వంటివి త్యాగం చేసావా అని ప్రశ్నించారు. వాటిని వదులుకుని వచ్చిన వచ్చినందుకు ఎంత బాధ పడుతున్నావ్ అని ప్రశ్నించారు. భీమవరంలో సూర్య మిత్ర ఎక్స్పోర్ట్స్ అధినేత సూర్యారావు నువ్వు గెలవడానికి రెండు వేల రూపాయలు, మూడు వేల రూపాయలు పంచ లేదా అని ప్రశ్నించారు. అయినా భీమవరం ప్రజలు నిన్ను ఓడించలేదా అని ప్రశ్నించారు. కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే నువ్వు ఇన్కమ్ టాక్స్ సరిగ్గా పడుతున్నావా అని ప్రశ్నించారు.
అజ్ఞాతవాసి సినిమాకు వంద రూపాయల టికెట్ ను 400 500 రూపాయలకు థియేటర్ల వాళ్లు అమ్ముకుంటే నువ్వు ఎందుకు అడగలేదు అని ప్రశ్నించారు. నువ్వు అసలు ఏ త్యాగం చేయలేదన్నారు. నాదెండ్ల మనోహర్ స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్న నువ్వు ఎప్పటికీ రాజకీయ నాయకుడిగా కాలేవన్నారు. ప్రస్తుతం రాజధానిలో సేకరించిన 30 వేల ఎకరాల్లో ఐదు వేల ఎకరాలు మాత్రమే ఉన్నాయని మిగిలిన భూమి ఎప్పుడో చంద్రబాబు తన అనుచరులకు దోచి పెట్టారని ప్రశ్నించారు. ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా ను చంపిన తెలుగుదేశం పార్టీతో కలిసి రంగాని చంపిన రక్తపుమడుగులో మడుగులో ఎలా నడుస్తున్నావని ప్రశ్నించారు. ఎందుకు అంత నీచంగా ప్రవర్తిస్తున్నావు అర్థం కావడం లేదన్నారు. చిరంజీవిని చింతకాయల అయ్యన్న కొడుకు విజయ్ దౌర్భాగ్యుడు నీచుడు వాడు వీడు అని తిట్టిన విషయం తెలిసే అయ్యన్నపాత్రుడుతో కలిసావా అని ప్రశ్నించారు. నీ ఆస్తులు అసలు ఏమున్నాయని ఏం చేసావ్ అని నువ్వు మేకప్ తీసేస్తే జీరో.. పరిశ్రమకు ఏదైనా చేసేవా ఏదైనా ఇండస్ట్రీ పెట్టావా ఉపాధి కల్పించావ అని ఆడిగారం. మీ సినిమాలకు బ్లాక్ టిక్కెట్లు అమ్మడం ఆపాలని ఇన్ కం టాక్స్ సక్రమంగా కట్టాలని సూచించారు.