Home / CRIME / మీరు ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా..?

మీరు ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా..?

మీరు ఇయర్ ఫోన్స్ లేనిదే ఫోన్ మాట్లాడటం చేయరా..?. అవి లేకుండానే మీరు పాటలు వినడం కానీ వీడియోలు చూడటం కానీ చేయరా..?. అయితే ఇయర్ ఫోన్స్ తో బీకేర్ ఫుల్. ఇయర్ ఫోన్స్ ఒక యువకుడి ప్రాణాలను తీసింది.

ఈ సంఘటన థాయ్ లాంట్ లో చోటు చేసుకుంది. సొమ్చీ సింగి ఖార్న్ అనే వ్యక్తి తాను పనిచేస్తున్న హోటల్ లో పని అంతా పూర్తిచేసుకుని రెస్ట్ తీసుకుంటూ చనిపోయాడు. అనుమానం వచ్చిన పోలీసులు అక్కడకి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు.

మొబైల్ ఛార్జర్ కు ఫోన్ కనెక్ట్ చేసి ఉండటం చూసి పోలీసులు షాకయ్యారు. దీంతో ఇయర్ ఫోన్స్ ద్వారా కరెంటు సరఫరా అయి అతడు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.