Breaking News
Home / MOVIES / రాజకీయాల్లోకి శ్రీరెడ్డి..?.. ఏ పార్టీలో చేరతారంటే..?

రాజకీయాల్లోకి శ్రీరెడ్డి..?.. ఏ పార్టీలో చేరతారంటే..?

శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ అంశంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్. ఈ వివాదంతో యావత్ ఇండస్ట్రీలోని హేమీహేమీలనే గడగడలాడించింది. సినిమాల కంటే ఇలాంటి వివాదాలతోనే ఈ ముద్దుగుమ్మ మీడియాలో ప్రసిద్దికెక్కింది.

తాజాగా ఆమె తమిళ హీరో,స్టాలిన్ రాజకీయ వారసుడు ఉదయ్ స్టాలిన్ తో ఒక ప్రముఖ రెస్టారెంట్ లో రోజంతా గడిపింది అని తమిళ మీడియాలో.. సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న వార్తల గురించి శ్రీరెడ్డి స్పందించింది.

ఆమె మాట్లాడుతూ” ఉదయ్ స్టాలిన్ ను ఇంతవరకు ఎన్నడూ కలవలేదు. ఇంతవరకు తనను ఎప్పుడు ఎక్కడ కూడా ప్రత్యేక్షంగా చూడలేదు”అని చెప్పుకుంటూ వచ్చింది. శ్రీరెడ్డి ఇంకా మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏ పార్టీలో చేరతానో.. రెండు మూడు రోజుల్లో అధికారక ప్రకటన వస్తుంది.. తమిళ నాడులో ప్రముఖ పార్టీలోకి వస్తాను అని ఆమె వెల్లడించింది.అయితే ఆమె డీఎంకే పార్టీలో చేరోచ్చు అని అక్కడి వారు అంటున్నారు.