Home / MOVIES / అది చేస్తే బాగుండేది.. తెగ ఫీలవుతున్న రకుల్ ప్రీత్

అది చేస్తే బాగుండేది.. తెగ ఫీలవుతున్న రకుల్ ప్రీత్

రకుల్ ప్రీత్ సింగ్ యువహీరో సరసన నటించి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన బక్కపలచు భామ. ఒకపక్క అందాలను ఆరబోసే పాత్రల్లో నటిస్తూనే మరో వైపు కథ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో చెరగని ముద్రవేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడ్ని ఒక బాధ ఎప్పటికి వెంటాడుతుంది అని చెప్పుకు వస్తూ ఉంది.

విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మంధాన హీరోయిన్ గా దర్శకుడు పరుశురామ్ నేతృత్వంలోని వచ్చిన గీతగోవిందం ఎంత ఘన విజయం సాధించిందో.. ఈ మూవీతో హీరోయిన్ గా రష్మిక మంధాన ఎంత ఎత్తుకు ఎదిగిందో మనకు తెల్సిందే. అయితే ఈ మూవీలో హీరోయిన్ రోల్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించింది అంట ఈ చిత్రం యూనిట్. అప్పుడు ఈ ముద్దుగుమ్మ డేట్స్ కుదరక నో చెప్పేసింది.

దీంతో ఈ మూవీలో నటించే అవకాశం కోల్పోయింది. ఈ మూవీలో నటించి ఉంటే అప్పటికే రకుల్ కున్న ఇమేజ్ తో మరింత టాప్ రేంజ్ కు చేరుకునేదని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అయితే అప్పటి నుండి ఈ ముద్దుగుమ్మ తెగ బాధపడుతుంది అంట. ఈ మూవీలో నటించనందుకు. దీనిపై అమ్మడు స్పందిస్తూ నటించనందుకు బాధపడకపోయిన కానీ ఆ మూవీలో నటించి ఉంటే బాగుండేది అని అన్పిస్తుందని లోలోపల బాధపడుతూ పైకి బాధలేదని చెప్పుకు వస్తుంది ఈ ముద్దుగుమ్మ.