Home / 18+ / బాలయ్య ఇకనైన అసలు నిజం చెప్తావా లేదా..?

బాలయ్య ఇకనైన అసలు నిజం చెప్తావా లేదా..?

80’s రీయూనియన్..దీనికోసం తెలియని వారు ఉండరు. 80’s, 90’s లోని నటీనటులు అంతా ఒక్కచోట కలిసి సరదాగా ఆ రోజంతా ఎంజాయ్ చేస్తారు. వారి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ముచట్లు చెప్పుకుంటారు. అలా ప్రతీ ఏడాది జరుపుకుంటారు. వారికి ఒకరు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తారు. ఇక తెలుగు నుండి అయితే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్ ఇలా అందరు ఉన్నారు. అయితే ఈసారి మాత్రం చిరంజీవి హోస్ట్ గా నిలిచాడు.తాను కొత్త ఇంటికి మారడంతో పనిలో పని అందరికి ఇది చూపించినట్టు కూడా ఉంటాడని చిరు ఇలా ప్లాన్ చేసాడు. మరోపక్క ఈసారి ఈవెంట్ హైదరాబాద్ కావడంతో రజినీకాంత్, కమల్ హాసన్ షూటింగ్ ఉండడంతో కుదరలేదు. తెలుగు లో రాజశేఖర్, జీవిత కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. మరో పక్క బాలయ్య కూడా రాలేదు. అయితే ఇక అసలు విషయానికి వస్తే బాలయ్య ఈసారే కాదు ఎప్పుడూ దీనికి దూరంగానే ఉన్నడంట ఎందుకు ఇలా అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. కారణం ఏదైనప్పటికీ బాలయ్య లేకపోవడం అందరికి కొంచెం లోటుగానే ఉంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.