Breaking News
Home / SLIDER / రేపు జర్నలిస్టులు గ్రీన్ ఛాలెంజ్

రేపు జర్నలిస్టులు గ్రీన్ ఛాలెంజ్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడానికి రాష్ట్రంలోని జర్నలిస్టులు తరలిరావాలని మీడియా అకాడమీ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం పిలుపునిచ్చాయి.

రేపు సోమవారం ఉదయం 10:30 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని జీహెచ్‌ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు.

తెలంగాణ కలం- హరితహారం అన్న నినాదంతో జరిగే ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.