Home / 18+ / ఛాన్స్ కొట్టేసిన శేఖర్ మాస్టర్..రష్మీ తో సినిమా !

ఛాన్స్ కొట్టేసిన శేఖర్ మాస్టర్..రష్మీ తో సినిమా !

శేఖర్ మాస్టర్ హీరోగా, యాంకర్ రష్మీ హీరోయిన్ గా చిత్రాన్ని రూపొందించేందుకు ఒక అగ్ర దర్శకుడు కథ తో సిద్ధంగా ఉన్నాడట. రష్మీ, శేఖర్ల తో సంప్రదింపులు చేస్తున్నాడట..బుల్లితెరపై శేఖర్ మాస్టర్ కు మంచి క్రేజ్ ఉంది. సినీ ఇండస్ట్రీ లోకూడా అగ్ర కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్నాడు.ఇప్పటికే తమ కెరీర్ ను డాన్సర్ , కొరియోగ్రాఫర్ గా మొదలుపెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హీరోగా స్థిరపడిన ప్రభుదేవా, లారెన్స్ ల మాదిరిగా శేఖర్ మాస్టర్ కూడా హీరోగా మారనున్నాడట. ఇప్పటికే కొన్ని షో లలో చిన్నా చితకా స్కిట్టులతో తన నటనను, టైంమింగ్ ను నిరూపించుకున్న విషయం తెలిసిందే. జడ్జిల కూడా శేఖర్ మాస్టర్ అనేక రియాల్టీ షోలలో తన పాత్ర పోషిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు.

 

 

ఇక రష్మీ విషయానికి వస్తే ఇప్పటికే హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది.. అంతకుమించి అంతం గుంటూరు టాకీస్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా ఇంకా చాలా సినిమాల్లో సైడ్ హీరోయిన్ గా నటించింది అందచందాలతో ఇప్పటికే బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే వెండితెరపై సందడి చేసింది. అలాగే శేఖర్ మాస్టర్ కూడా బుల్లితెర ప్రేక్షకులందరికీ దాదాపుగా పరిచయం అవడం ఇండస్ట్రీలోని పెద్ద ఎత్తున పరిచయాలు ఉండటం పరంగా కూడా శేఖర్ మాస్టర్ బాగా ఉండటంతో ఆయనను హీరోగా చేయాలని ప్రోత్సహించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. అన్ని కుదిరితే లారెన్స్ ప్రభుదేవా ల మాదిరిగానే శేఖర్ మాస్టర్ కూడా త్వరలో వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.