Home / CRIME / భార్యను చితకొట్టిన నటుడు

భార్యను చితకొట్టిన నటుడు

పంచభూతాల సాక్షిగా..బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాలతో మూడు ముళ్ల బంధంతో తాళి కట్టిన తన భార్యను బుల్లితెర నటుడు చితకొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మహానగరంలో స్థానిక తురువాన్మయార్,ఎల్బీ రోడ్డులో నటుడు ఐశ్వర్ రఘునాథన్ ఉంటున్నారు.

రఘునాథన్ భార్య అయిన జయశ్రీ వృత్తి రిత్యా డాన్స్ మాస్టర్. అయితే ఐశ్వర్ తన భార్యకు చెందిన ఆస్తుల డాక్యుమెంట్స్ ను కుదవపెట్టి డబ్బు తీసుకున్నాడని అక్కడ వినిపిస్తోన్న వార్తలు. ఈ కారణంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు వస్తోండేవి. అదే విధంగా మొన్న శనివారం కూడా ఇదే అంశంపై ఇరువురు గొడవపడ్డారు.

దీంతో ఆగ్రహించిన ఐశ్వర్ రఘునాథన్ తన భార్య జయశ్రీని చితకొట్టాడు. రఘు దాడితో తీవ్రంగా గాయపడిన ఆమెను అడయార్ లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి.. చికిత్స అందించారు. అనంతరం జయశ్రీ అడయార్ మహిళా పోలీసులకు భర్తపై పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న నటుడు ఐశ్వర్ రఘునాథన్ ,అతడి తల్లిని అరెస్టు చేశారు.