Home / MOVIES / అసలు కారణం ఇదేనంటూ రష్మిక

అసలు కారణం ఇదేనంటూ రష్మిక

ఛలో చిత్రంతో ఎంట్రీచ్చి గీత గీవిందం సినిమాతో స్టార్‌డమ్ కొట్టేసింది రష్మిక మందన్నా.. గౌతమ్ తిన్ననూరి, నాని కాంబినేషన్ లో వచ్చిన జెర్సీని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చినా పక్కన పెట్టేసింది.

రెమ్యునరేషన్ వల్లే రష్మిక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటిప రష్మిక స్పష్టత ఇచ్చింది.జెర్సీ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినపుడు..అందులో నా పాత్రకు న్యాయం చేయలేనపించింది. శ్రద్దాశ్రీనాథ్ పాత్రలో బాగా ఇమిడిపోయి నటించాలి. దానికి నేను రెడీగా లేను.

సినిమా విజయం సాధించడంలో హీరో, హీరోయిన్ల నటన చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సినిమా అంటే డబ్బు మాత్రమే కాదు. ఆ సినిమా కోసం మనం ఎంత కష్టపడ్డామనేదే ముఖ్యమైన విషయమని రష్మిక చెప్పింది.