Home / MOVIES / చంద్రబాబు ఆటోగ్రాఫ్, సెల్ఫీల కోసం వర్మ ట్వీట్లు…!

చంద్రబాబు ఆటోగ్రాఫ్, సెల్ఫీల కోసం వర్మ ట్వీట్లు…!

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వర్మ సినిమా సెన్సార్ బోర్డు u/a సర్టిఫికేట్ ఇచ్చి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆగుతారా. రోజుకో పోస్టర్, కామెంట్‌తో సినిమాను బీభత్సంగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘బాబు చంపేస్తాడు’ అనే పాటను విడుదల చేసి మరో బాంబ్ పేల్చారు వర్మ.
చంప మీద కొడితే తట్టుకోగలడు..

ఈ సినిమాలోని ‘బాబు చంపేస్తాడు’ అనే పాటను వర్మను విడుదల చేశారు. సొంత పార్టీ గురించి తప్పుగా ప్రసంగిస్తున్న నారా లోకేష్ సూత్రధారి చెప్పే డైలాగులతో పాట ప్రారంభమైంది. ‘చెంప మీద కొడితే తట్టుకోగలడు.. కాళ్ల మధ్య తంతే నిలదొక్కుకోగలడు.. కానీ అహం మీద కొడితే చంపేస్తాడు’ అంటూ సాగుతున్న ఈ పాటలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఉంటుంది. కొన్ని సీన్లలో నారా లోకేష్ పాత్రధారి బాక్సింగ్ చేస్తూ నిద్రపోతున్నట్లు ఫన్నీగా చూపించారు.

చంద్రబాబుగారు ఆయనకు మీ ఆటోగ్రాఫ్ కావాలట
అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో మాజీ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న ఈ వ్యక్తికి మీ ఆటోగ్రాఫ్ కావాలట. ప్లీజ్ ఒప్పుకోండి. సారీ సారీ.. ఈ నటుడికి మీతో సెల్ఫీ దిగాలని ఉందట. ప్లీజ్ ఒప్పుకోండి’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేసి నేరుగా బాబుకు ట్యాగ్ చేశారట ఇంతకీ అతనుఎవరో కాదు.. చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న వ్యక్తే.

సినిమాలను ప్రమోట్ చేయడంలో వర్మ తర్వాతే ఎవరైనా. అమ్మ రాజ్యంలో కడపరెడ్లు సినిమా డిసెంబర్ 12న విడుదల అవుతున్న సందర్భంగా ఓ ఆసక్తికరమైన ఫొటోను వర్మ ట్వీట్ చేశారు. బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తే పోస్టర్‌లో ప్రభాస్ ఫొటోకి బదులు తన ముఖాన్ని మార్ఫ్ చేశారు. అంతేకాదు దీనికి ‘బాబుబలి’ అని క్యాప్షన్ ఇచ్చారు. సినిమాను ప్రమోట్ చేసుకోవదానికి కాంట్రవర్శిని ఉపయోగించుకోవంలో వర్మ తరువాతే ఎవరైనా.. సినిమా డిసెంబర్ 12న విడుదల కావస్తోందన్న విషయం తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat