Home / ANDHRAPRADESH / అమ్మఒడి పథకం పై కాంగ్రెస్ నేత తులసీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమ్మఒడి పథకం పై కాంగ్రెస్ నేత తులసీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం తమ పిల్లలను పాఠశాలకు పంపితే అమ్మఒడి పథకం కింద రూ. పదిహేను వేల రూపాయలను ఇస్తున్న సంగతి విదితమే.

అయితే ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న అమ్మఒడి పథకంపై అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. అయితే అమ్మఒడి పథకంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత తులసీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ” అమ్మఒడి పథకం కాదని.. మమ్మి ఒడి పథకమని ఎద్దేవా చేశారు.

పిల్లలకు మేనమామ కాకపోయిన పర్వాలేదు కానీ శకుని మామ కావొద్దని హితవు పలికారు. తల్లిభాషను హత్య చేసిన హంతక ప్రభుత్వానికి అమ్మ అనే అర్హత లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని సంక్షేమ శాఖల నిధులను అమ్మఒడికి తరలించారు అని ఆయన ఆరోపించారు.