టీమిండియా మాజీ సీనియర్ ఆటగాడు..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎంపీ గౌతమ్ గంభీర్ కు బీసీసీఐలో కీలక పదవీ వచ్చింది.
అత్యంత ప్రతిష్టాత్మక బీసీసీఐ సలహామండలి కమిటీ సభ్యుడిగా గౌతమ్ కు అవకాశం కల్పించనున్నారు.ముగ్గురు సభ్యులతో కూడిన ఈ సలహామండలిలో మాజీ క్రికెటర్లు మదన్ లాల్,సులక్షణ సింగ్ ఎంపిక కానున్నారని సమాచారం..
ప్రస్తుత సెలక్షన్ కమిటీ పదవీ కాలం ముగియడంతో కొత్త కమిటీని వీరు ఏర్పాటు చేయనున్నారని సమాచారం..