Breaking News
Home / POLITICS / కాంగ్రెస్ నేతలపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్..!!

కాంగ్రెస్ నేతలపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్..!!

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్ర్తెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ” ఆరవై ఏళ్లలో ఏనాడు కూడా పట్టణాల అభివృద్ధికై ఆలోచించలేదు. ఎలాంటి పథకాలను అమలు చేయలేదు. కాంగ్రెస్ హాయాంలో తెలంగాణ అభివృద్ధికై చేసింది శూన్యం అని అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో వర్ధన్నపేట మున్సిపల్ బాగా అభివృద్ధి చెందింది. తాము అధికారంలోకి వచ్చాక ఆసరా పించన్లను పెంచాము. కాళేశ్వర ప్రాజెక్టును పూర్తి చేశాము. రైతన్నలకు ఎలాంటి సమస్యలు లేకుండా చేశాము. పల్లెప్రగతితో గ్రామాల్లో … పల్లెల్లో మార్పు వచ్చింది. త్వరలోనే పట్టణ ప్రగతితో కూడా పట్టణాల్లో మార్పు తీసుకోస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో పాటు MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.