Breaking News
Home / LIFE STYLE / ఉల్లితో లాభాలెన్నో…!

ఉల్లితో లాభాలెన్నో…!

మాములుగా పెద్దలు మన వంటింట్లో ఉండే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఉల్లిగడ్డల్ని వంటల్లో వాడడమే కాకుండా వివిధ రూపాల్లో ఔషధంగా కూడా తీసుకోవచ్చు. అవేంటంటే..

*నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లలను (4 ఏండ్ల పైబడిన వారికే) నిద్రపుచ్చేందుకు ఓ చిన్న ఉల్లిపాయ పొట్టు తీయాలి. దాన్ని నీళ్లలో వేసి వేడి చేయాలి. ఆ తర్వాత నీటిని మాత్రమే ఓ
గిన్నెలోకి తీసుకొని అందులో రెండు టీ స్పూన్‌ల చక్కెర చేర్చి ఇస్తే పిల్లలకు మంచి నిద్రవస్తుంది.

* కొంతమంది చిన్నారులకు చెవి నొప్పి ఉంటుంది. ఇలాంటి వారికి ఉల్లిపాయ రసం తీసుకొని వేడి చేసి చల్లార్చిన తర్వాత చెవిలో వేస్తే చెవి నొప్పి తగ్గిపోతుంది.
* అజీర్తి కారణంగా వాంతులు, విరేచనాలు ఎక్కువగా అయ్యే వారు ఉల్లిపాయ రసం అరకప్పు తీసుకొని గోరువెచ్చని నీటిని కలిపి అప్పుడప్పుడు తాగితే వాంతులు, విరేచనాలు
తగ్గుతాయి.
* ముక్కు ద్వారా రక్తం కారుతుంటే ఉల్లిపాయను కట్‌ చేసి ముక్కు దగ్గర పెట్టి వాసన చూస్తే వెంటనే రక్తం ఆగిపోతుంది.
* ఉల్లిపాయ రసం, వంట నూనె సమపాళ్లలో కలిపి ఆ రసాన్ని నాలుగైదు చుక్కలు పుచ్చు పళ్లు ఉన్న దగ్గర పట్టిస్తే వెంటనే నొప్పి తగ్గుతుంది.