ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర గతంలో పీఎస్ గా పనిచేసిన పి శ్రీనివాస్ ఇళ్ళపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఐటీ దాడుల్లో సుమారు రెండు వేల కోట్లకు పైగా అక్ర్తమాస్తులను ఐటీ అధికారులు గుర్తించారు.
ఐటీ దాడుల్లో శ్రీనివాస్ దగ్గర కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీనివాస్ ఐదేళ్లు రాసిన ఒక డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలో అనేక కీలకమైన అంశాలు ఉన్నాయని ప్రముఖ తెలుగు మీడియా పత్రికలో కథనాలు వెలువడ్డాయి.
ఈ క్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,అతని తనయుడు లోకేష్ ఇండ్లపై ఐటీ దాడులు జరగాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మొత్తం నలబై చోట్ల ఐటీ దాడులు జరిగినట్లు వీరిద్దరి ఇండ్లపై ఐటీ దాడులు జరగాలి. ఐటీ దాడులతో బాబు అవినీతి బయటకు వస్తుంది. లక్ష కోట్ల అవినీతి వెలుగులోకి వస్తుంది అని ఆయన అన్నారు. మరి మంత్రి డిమాండ్ చేసినట్లు బాబు అండ్ లోకేష్ ఇండ్లపై ఐటీ దాడులు
జరుగుతాయా..?