Home / MOVIES / నీకు నువ్వు ప్రేమ లేఖ రాసుకో… ప్రేమికుల రోజు ఉపాసన ట్వీట్‌

నీకు నువ్వు ప్రేమ లేఖ రాసుకో… ప్రేమికుల రోజు ఉపాసన ట్వీట్‌

హీరో రామ్‌చరణ్‌ భార్య ఉపాసన సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే తెలిసిందే. ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలతోపాటు పలు సామాజిక అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తారు ఉపాసన. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఆమె చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. మానవ సంబంధాలు బలపడాలంటే నిన్ను నువ్వు ప్రేమించడమే తారక మంత్రం అని ఉపాసన అంటున్నారు. ఈ వాలంటైన్స్‌ డే రోజున బంధాలను మరింత బలంగా మార్చాలనుకుంటున్నారా అని ప్రశ్నించిన ఉపాసన.. అందుకు కొన్ని సూచనలు కూడా చేశారు. ‘మొదట నిన్ను నువ్వు ప్రేమించడానికి ప్రయత్నించు. అప్పుడే ఎలాంటి షరతులు లేకుండా ఇతరులను ప్రేమించే దృష్టి అలవడుతుంది. నీకు నువ్వు ప్రేమ లేఖ రాసుకో. నీకు సంతోషం కలిగించే పనులు మాత్రమే చేయి. నీ మొత్తం ప్రపంచం మార్పుకు సాక్ష్యంగా నిలువు’ అని పేర్కొన్నారు. ఉపాసన ట్వీట్‌పై నెటిన్లు స్పందిస్తూ.. చాలా బాగా చెప్పారని కామెంట్లు పెడుతున్నారు.