Home / 18+ / టైటిల్ తో ప్రేమికులు రోజుకు చెడ్డ పేరు తీసుకోచ్చాడంటారా..?

టైటిల్ తో ప్రేమికులు రోజుకు చెడ్డ పేరు తీసుకోచ్చాడంటారా..?

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రం ఈ రోజు ప్రేమికులు రోజు సందర్భంగా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి గాను మాధవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి వీడియో లేదా ఫోటో వచ్చినా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇక సినిమా విడుదల అయిన తరువాత చూసుకుంటే మొత్తం బెడిసికొట్టిందని చెప్పాలి. సినిమా పరంగా చూసుకుంటే అంతగా ఏం బాలేదని బయట టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. పబ్లిక్ సినిమా టైటిల్ వరల్డ్ ఫేమస్ లవర్ అని పెట్టి ప్రేమికుల రోజు పరువు తీసేశారు అని అంటున్నారు. మరి ఇకనైనా అతడు చెప్పినట్టు లవ్ స్టోరీస్ వదిలేసి వేరే జోలికి వెల్తాడో లేదో చూడాలి మరి.