Home / SLIDER / పుజారా 25వ హాఫ్ సెంచ‌రీ..

పుజారా 25వ హాఫ్ సెంచ‌రీ..

కైస్ట్ చర్చ్ లో ఈ రోజు శనివారం టీమిండియా ,కివీస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఉదయం మొదలైన ఈ మ్యాచులో టీమిండియా ఐదు వికెట్లను కోల్పోయింది. ఆర్థశతకం సాధించిన తర్వాత హనుమా విహారీ ఔటయ్యాడు.

రెండో టెస్టు మ్యాచ్ రెండో సెషన్ ముగిసేవరకు ఐదు వికెట్లను కోల్పోయి మొత్తం 53.4ఓవర్లలో 194పరుగులను సాధించింది. చతేశ్వర్ పుజారా యాబై మూడు పరుగులతో ఇంకా క్రీజులో ఉన్నాడు.

టెస్టుల్లో పుజారాకు ఇది ఇరవై ఐదో హాఫ్ సెంచురీ.అయితే ఐదో వికెట్ కు విహారి ,పుజారాలు ఎనబై ఒక్క పరుగులు చేశారు. యాబై ఐదు పరుగులు చేశాక విహారీ క్యాచ్ ఔట‌య్యాడు.