Home / SLIDER / ఐపీఎల్ వాయిదాపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ వాయిదాపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు

కరోనా ప్రభావంతో ఐపీఎల్ వాయిదా పడిన సంగతి విదితమే. ఏప్రిల్ పదిహేనో తారీఖు దాక ఐపీఎల్ వాయిదా పడింది. ఐపీఎల్ వాయిదా వేయడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు.

దాదా మీడియాతో మాట్లాడుతూ”ప్రస్తుతానికి అయితే ఐపీఎల్ ను వాయిదా వేశాము. త్వరలోనే ఐపీఎల్ కు చెందిన షెడ్యూల్ ను విడుదల చేస్తాము. అందరి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.

ఐపీఎల్ ముఖ్యమే. అందరూ ముఖ్యమే అని అన్నారు. అయితే మొదట ఐపీఎల్ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుండి జరగాల్సి ఉంది.ఐపీఎల్ వాయిదాతో క్రికెట్ ప్రేమికులు నిరాశలో మునిగిపోయారు.