Home / NATIONAL / మద్యం ప్రియులకు శుభవార్త

మద్యం ప్రియులకు శుభవార్త

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించిన విషయం విదితమే. అయితే గ్రీన్‌ జోన్లలో మద్యం, పాన్‌ దుకాణాలను అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మద్యం, పాన్‌ షాపుల వద్ద 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది.

లాక్‌డౌన్‌ రెండో దఫా ఈ నెల 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మే 4 నుంచి 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.