Home / CRIME / వయస్సు 70.. నలుగురు భార్యలు.. యువతిపై దారుణం!

వయస్సు 70.. నలుగురు భార్యలు.. యువతిపై దారుణం!

ఓ వైపు కరోనా.. మరోవైపు లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. 70 ఏళ్ల వృద్ధుడు.. ఆయనకు నలుగురు భార్యలు. అయినా అమ్మాయిలు అంటే పిచ్చి.! ఓ అమ్మాయికి ఆర్థికసాయం చేస్తానంటూ నమ్మించి.. ఇంటికి పిలిపించి మత్తుమందు ఇచ్చి ఆపై అత్యాచారానికి పాల్పడిన ఘటన బయటపడింది. అసలేం జరిగింది..? ఎవరీ వృద్ధ కామాంధుడు అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అసలేం జరిగింది!?

బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో 70 ఏళ్ల మొహమ్మద్ సలీమ్ ఉద్దీన్‌ నివాసముంటున్నాడు. సలీమ్‌కు నలుగురు భార్యలు.. వారంతా విదేశాల్లో ఉంటారు. సలీమ్ కూడా విదేశాల్లోనే ఉండి అమ్మాయిల కోసం తరచూ హైదరాబాద్‌కు వస్తూ ఉంటాడు. నిరుపేద అమ్మాయిలకు ఆర్థిక సహాయం చేస్తానంటూ నమ్మించి ఇంటికి పిలిపించుకుని వారిపై అఘాయిత్యానికి పాల్పడటమే అతని పని.! తాజాగా.. 23 ఏళ్ల యువతిపై కన్నేసిన సలీం ఆర్థిక సహాయం పేరుతో ఇంటికి పిలిపించుకున్నాడు. అనంతరం ఆ యువతికి మత్తు మందిచ్చి పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. స్పృహలోకి వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన బాలిక పూర్తి ఆధారాలతో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat