Home / ANDHRAPRADESH / ఏపీలో మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ..

ఏపీలో మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు విషయం ఎటుతేలకపోవడంతో ఖాళీ అవుతున్న స్ధానాలపై అధికార పార్టీ దృష్టి సారించింది. మొత్తం నాలుగు స్ధానాలు ఖాళీ అవుతున్నాయి. మంత్రులు గా ఉంటూ రాజ్యసభకు ఎన్నిక కావడంతో పిల్లి సుభాష్ బోస్, మోపిదేవి వెంకటరమణలు తమ ఎమ్మెల్సీ పదవులకు సోమవారం రాజీనామా చేయనున్నారు . ఈ రెండిటితో పాటు , గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న టి. రత్నాభాయ్ , కంతేటి సత్యనారాయణరాజు ల పదవీకాలం పూర్తికావడంతో వాటిని కూడా భర్తీ చేయనున్నారు.మొత్తం నాలుగు స్థానాల
అభ్యర్ధుల ఎంపికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే ఒక నిర్ణయం వచ్చినట్లు సమాచారం.
।।।……..।।।

ఇటీవలే ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ( ఎస్సీ -మాదిగ ) ను ఎంపిక చేసిన జగన్ …ఈసారి ఒక ఎమ్మెల్సీ పదవిని ఎస్సీ ( మాల ) సామాజిక వర్గానికి చెందిన నేతను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత , గత ఎన్నికలలో టికెట్ దక్కని కొయ్యా మోసేన్ రాజుకు ఛాన్స్ దక్కవచ్చు. గత ఎన్నికలకు కొన్ని రోజుల ముందే పార్టీలో చేరిన మాజీ ఎంపి పండుల రవీంద్రబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని ఎన్నికల ప్రచారం లో జగన్ హామీ ఇచ్చారు. ఐతే కొయ్యా మోసేన్ రాజు పార్టీలో మొదటి నుండి ఉన్న నేపధ్యంలో అతనివైపే జగన్ మొగ్గు చూపే అవకాశాలున్నాయి.
…….।।….
మరోవైపు కాపుల విషయంలో ప్రత్యేక దృష్టిసారిస్తున్న వైసీపీ ..ఈ సారి భర్తీ చేసే ఎమ్మెల్సీల్లో ఒక స్ధానం వారికి కేటాయించాలనే యోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాపు నేతకు ఛాన్స్ దక్కవచ్చు. మాజీ ఎమ్మెల్యే , అమలాపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తోట త్రిమూర్తులు కి ఎమ్మెల్సీ బెర్త్ ఖాయం కావచ్చు . తోట పార్టీలో చేరినపుడు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని సీఎం స్వయంగా హామీ ఇచ్చారు . ఆ హామీ నెరవేర్చేక్రమంతో పాటు కొన్ని సమీకరణాలు కారణంగా తోట త్రిమూర్తులుకు ఈసారి ఛాన్స్ కల్పించవచ్చు . మరో స్థానాన్ని మైనారిటీ వర్గాలకు కేటాయించాలనే ఆలోచనలో ఉన్న సీఎం కడపకు జిల్లాకు చెందిన మైనార్టీ నేతకు అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరో స్ధానాన్ని బీసీ లకు లేదా గత ఎన్నికలలో టికెట్ దక్కని రెడ్డి లేదా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకు కేటాయిస్తే ఎలా ఉంటుందనే చర్చ పార్టీ ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

అన్నిటికంటే కీలకంగా అటు ఎమ్మెల్సీలతో పాటు నామినేటేట్ పదవులలో ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించని అత్యంత వెనకబడిన కులాలకు అవకాశం కల్పించేలా ఒక యాక్షన్ ప్లాన్ కు జగన్ రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటివరకు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించని శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ బోస్ ను ఎంపిక చేయడం కూడా ముఖ్యమంత్రి ఈ వ్యూహంలో భాగంగానే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముందుముందు దక్కే పదవులలో రాయలసీమలో అత్యధికంగా ఉండే బలిజ సామాజిక వర్గానికి , పద్మశాలీ , మైనారిటీలలోని దూదేకల వర్గానికి చెందిన వారికి పదవులలో ప్రాతినిధ్యం కల్పించాలనే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
@@
DURGA

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat