Home / ANDHRAPRADESH / ఏపీలో ఈఎస్ఐ స్కాం కలవరం

ఏపీలో ఈఎస్ఐ స్కాం కలవరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్ కేసు విచారణలో ఏసీబీ జోరు పెంచింది.

మాజీ మంత్రి పితాని పీఎస్ మురళిని పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. పితాని కొడుకు సురేష్ కోసం గాలింపు చేపడుతున్నారు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సురేష్ ఉన్నట్లు సమాచారం రావడంతో కొన్ని బృందాలను పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను మురళి, సురేష్ వేయగా.. విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.