Home / ANDHRAPRADESH / ఢిల్లీలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన

ఢిల్లీలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన

దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు.

పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిలు, విభజన చట్టంలో పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. ‘కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయింది.

పన్ను వసూళ్లలో నెలల్లో 40% లోటు ఏర్పడింది. ఇవ్వాల్సిన బకాయిలు, ఇతర నిధులు ఇచ్చి కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవాలి’ అని బుగ్గన అన్నారు.