సూపర్’గా తొలి సినిమా నుంచి సాగిపోతున్న అనుష్క.. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా మారింది. దానికి కారణం పర్సనాలిటీ అదరహోగా ఉండటమే! ఒక్క మాటలో వర్ణించాలంటే.. అందం, అభినయం ఆరడుగుల పోత పోస్తే అనుష్క. దీంతో దర్శకులు కలలు కన్న పాత్రలకు తనే మొదటి ఛాయిస్ అయింది. అన్ని పాత్రల్లో ఒదిగిపోవడానికి ఆమె గ్లామరస్ లుకు కూడా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు అయితే ఈ రోజు అంతర్జాతీయ బాలికల దినోత్సవం. ఈసందర్భంగా ‘దేవసేన’ అనుష్క ప్రపంచంలోని ఆడపిల్లలందరినీ ఉద్దేశిస్తూ ఓ ప్రత్యేక సందేశాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసింది.
‘సమాజంలో ఆడపిల్లల హక్కు కోసం మనమంతా శ్రమిద్దాం. భూమ్మీదప్రతి ఆడపిల్లకి తాను క్షేమంగా ఉండాలని, చదువుకోవాలని, సమాన హక్కులు ఉండాలని కోరుకునే హక్కు ఉంటుంది. హ్యాపీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్’ అని పోస్ట్‌లో పేర్కొంది అనుష్క. ఈ సందర్భంగా ఓ చిన్నారితో కలిసి ఆప్యాయంగా దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంది.
ప్రస్తుతం అనుష్క ‘భాగమతి’ చిత్రంలో నటిస్తోంది. జి.అశోక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్.ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. నవంబర్7న అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. 2018 జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
