చంద్రబాబు ఊసర వెళ్లి రాజకీయం టాలీవుడ్‌లో ఓ పెను దుమారమే రేపింది. అంతలా ప్రతిష్టాత్మకంగా నంది అవార్డులను ప్రకటించింది చంద్రబాబు సర్కార్. ఈ నంది అవార్డులతో కొంతమంది సంతృప్తిగా ఉన్నా.. మరికొందరు వారి వారి అసంతృప్తులను వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక వసూళ్లు సాధించినా.. నేషనల్ అవార్డులు పొందినా.. అప్పటికీ ప్రాణంపెట్టి మరీ క్యారెక్టర్‌లో ఇన్వాల్ అయి నటించినా గుర్తింపుగా అవార్డులు రాకపోవడంతో పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వారి వారి అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.
అయితే, ఈ వివాదం అంతటితో ఆగలేదు. ఏకంగా జీవితంలోని రహస్యలను సైతం బయట పెట్టుకునేలా చేసింది ఈ నంది అవార్డుల ప్రకటన. ఇంతకీ జీవిత రహస్యాలను బయటపెట్టుకునేలా గొడవపడింది ఎవరనేగా మీ డౌటు. వారేనండీ.. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్, నల్లమలుపు బుజ్జి. మీడియా వేదికగా చెలరేగిన వీరి వివాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది టాలీవుడ్.
మొదటగా.. మేం మంచి ఫ్రెండ్స్ అంటూ మొదలైన వీరి మాటలు.. ఒకరి బతుకు మరొకరు బస్టాండ్‌పాలు చేశారు. నీది చిల్లర బతుకు అంటూ నల్లమలుపు బుజ్జీ.. సీ.కళ్యాణ్‌పై సెటర్ వేస్తే.. నాది కాదురా. .చిల్లర బ్రతుకు నీది.. నీ బతుకు నాకు తెలియదేంట్రా? అంటూ దుర్భాషలాడుకున్నారు. ముందు నువ్వు మంచి సినిమాలు తీయి.. అవార్డులు వాటంతట అవే వస్తాయి.. గొడవలు చేస్తే అవార్డులొస్తాయా? అంటూ నల్లమలుపు బుజ్జిపై సీ.కళ్యాణ్ చెలరేగిపోయాడు. ఇది విన్న వెంటనే ఒక్క హిట్ సినిమా తీసి మాట్లాడు.. ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది అంటూ కళ్యాణ్‌కి నల్లమలుపు కౌంటర్ ఇచ్చాడు.ఏదేమైనా, చంద్రబాబు సర్కార్ ప్రకటించిన నంది వార్డుల జాబితా వీరిద్దరిని రోడ్డుకెక్కేలా చేసిందంటూ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.