‘ఏమైందో తెలియదు నాకు.. ఏమైందో తెలియదు నాకు.. నీ పేరే పాటయ్యింది పెదవులకు..’ అంటున్నారు నేచురల్ స్టార్ నాని. మరి ‘ఫిదా’ భామ సాయిపల్లవి ఏమో.. ‘ఈ మాయలో నిన్నిలా ముంచినందుకు నా పరిచయం వరమని పొగిడె చంపకు..’ అంటున్నారు. వీరిద్దరు జంటగా నటిస్తున్న సినిమా ‘ఎంసిఎ’. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలను విడుదల చేశారు. లేటెస్టుగా శనివారం(డిసెంబర్-9) సాయంత్రం మరోపాటను విడుదల చేశారు. ఈ పాటను కార్తిక్, వి. దీపిక పాడారు. ఇందులో నాని, సాయిపల్లవి చూడచక్కగా కనిపించారు.మెలోడీగా సాగే ఈ పాట తనకు చాలా ఇష్టమని నాని ట్వీట్ చేశారు. ఇది మీకూ నచ్చుతుందని ఆశిస్తున్నట్లు అభిమానుల్ని ఉద్దేశించి అన్నారు. పాట లింక్‌ను పంచుకున్నారు. సినిమాకి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్‌కు థాంక్స్ చెప్పారు. శ్రీరామ్ వేణు ‘ఎంసిఎ’ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాలో భూమిక, నరేష్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబరు 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
#EmaindoTeliyaduNaku ?
My favourite.. hope it will be your’s too ?
Thank you @ThisIsDSP @singer_karthik #DeepikaV #Srimani https://t.co/kPSgFvxxTm— Nani (@NameisNani) December 9, 2017