Home / MOVIES / దిల్ రాజుకు ఘోరంగా దెబ్బేసిన.. ఇద్ద‌రు బ‌డా స్టార్‌ హీరోలు..!

దిల్ రాజుకు ఘోరంగా దెబ్బేసిన.. ఇద్ద‌రు బ‌డా స్టార్‌ హీరోలు..!

టాలీవుడ్ ప్ర‌ముఖ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒక‌రు. ఒక‌వైపు నిర్మాత‌గా మంచి చిత్రాల‌ను నిర్మిస్తూ.. మ‌రోవైపు చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తారు. అయితే తాజాగా దిల్ రాజు న‌ట్టేట మునిగార‌నే వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే మ‌హేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రాన్ని నైజాం ఏరియాలో రిలీజ్ చేసాడు దిల్ రాజు. ఆ సినిమాకు పోటీ ఎక్కువగా ఉండటంతో 22 కోట్లకు నైజాం హక్కులను సొంతం చేసుకున్నాడు. అయితే గత ఏడాది విడుదలైన ఆ చిత్రం ఎంతటి ఘోర పరాజయం పొందిందో అందరికి తెలిసిందే.

ఇక మ‌రోసారి కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసి చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాని ఏకంగా 29 కోట్ల కు కొన్నాడు దిల్ రాజు. తీరా ఈ సినిమా పది, పన్నెండు కోట్ల షేర్ రాబట్టడమే గగణమైపోతోంది. దాంతో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబుల వల్ల ఏకంగా 30 కోట్ల నష్టాన్ని అందుకున్నాడు దిల్ రాజు. దీంతో గ‌త ఏడాది వ‌రుస‌గా ఆరు చిత్రాల‌ను నిర్మించి డ‌బుల్ హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న దిల్ రాజును మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు న‌ట్టేట ముంచేశార‌ని సోష‌ల్ మీడియాలో సినీ జ‌నాలు పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ వ్య‌వ‌హారం వైర‌ల్ అవుతోంది.

 

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat