తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయ ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ,నిజామాబాద్ ఎంపీ కవిత తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు .అచ్చం తన తండ్రి మాదిరిగా కష్టాల్లో ఉన్నవారికి అండగా నేనున్నానని తనలోని గొప్ప మనస్సును చాటుకున్నారు.
అసలు విషయానికి వస్తే.. నిజామాబాద్ జిల్లాలో బినోల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచుగా ఉన్న మోచి బాలరాజు ప్రమాదశావత్తు మురికి కాలవలో పడి 2016 మార్చి 12 మృతి చెందారు.బాలరాజు చనిపోవడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కునే కోల్పోయింది.
దీంతో ఎంపీ కవిత ఆ కుటుంబానికి అండగా ఉండటానికి ముందుకొచ్చారు .బాలరాజు అంత్యక్రియలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కవిత భరించారు.దగ్గరే ఉండి మరి అన్ని ఏర్పాట్లను ఆమె చూసుకున్నారు.తాజాగా మరోసారి ఆ కుటుంబానికి అన్ని తానై వచ్చే నెలలో జరగనున్న బాలరాజు కుమార్తె పెళ్ళికి మూడు లక్షల రూపాయలను ఆర్థిక సాయమందించారు.తనలో ఉన్న సేవా గుణాన్ని ,మంచితనాన్ని మరోసారి చాటిచెప్పి అందరికి ఆదర్శంగా నిలిచి తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు ఎంపీ కవిత .
see also : ఏపీకి బడ్జెట్… చంద్రబాబు తిరిగిన ఖర్చులకైనా వచ్చిందా… జేసీ దివాకర్ రెడ్డి
see also : తెలంగాణలో టైమ్స్ నౌ -వీఎంఆర్ లేటెస్ట్ సర్వే ..ఎవరికి ఎన్ని సీట్లు ..?