ద్యావుడా..! అబ్బాయినీ వదల్లేదుగా..!! అవును, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ను ఆ క్రియేటివ్ సెన్షేషనల్ డైరెక్టర్ వదల్లేదు. మొన్నటి వరకు బాబాయ్‌పై పొగుడుతూనే వ్యక్తిగత విమర్శలు గుప్పించిన ఆ డైరెక్టర్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌పై కామెంట్లు కురిపించారు. అతనే, జీఎస్టీకి మరో అర్థం చెప్పి యువకులకు మరింత దగ్గరైన సెన్షేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. అయితే, ఇంతకీ రామ్‌గోపాల్ వర్మ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ఏమన్నాడనేగా మీ డౌట్.
అసలు విషయానికొస్తే.. రామ్‌చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రంగస్థలం చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్‌చరణ్, సమంతల క్యారెక్టరైజేషన్‌ను తెలుపుతూ సుకుమార్ తన క్రియేటివిటీని ప్రదర్శిస్తూ ఇటీవల టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్లను చూసిన రామ్‌గోపాల్ వర్మ సుకుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి బ్యాక్‌డ్రాప్‌గల చిత్రం రాలేదని, అలాగే, పాటల రచయిత చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సరితూగిందంటూ.. చిత్ర బృందానికి నా మనస్ఫూర్తి అభినందనలని చెప్పాడు.