నేను అలాంటిదాన్ని కాదంటున్నా..! ఆ ప్రొడ్యూసర్ ఎవరో మరీ..!! తెలుగు సినీ ఇండస్ర్టీలో అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి.. స్టార్ హీరోయిన్ లక్జరీ లైఫ్‌ను అనుభవిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. పంజాబ్ నుంచి వచ్చిన ఈ భామ కెరియర్ ప్రారంభంలో చిన్న హీరోల సరసన అడపా దడపా సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత వరుసబెట్టి మరీ స్టార్ హీరోల సరసన వెండితెరను పంచుకుంది.
see also : మెగా ఫ్యామిలీలో.. చిరంజీవి తప్ప పనికొచ్చే వారే లేరా..?
అయితే, రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను బయటపెట్టింది. తనకు అస్సలు మద్యం తాగే అలవాటే లేదని, ఆ విషయం ఎవరికి చెప్పినా నమ్మడం లేదంటుంది. నా ఫిజిక్‌ను చూస్తే చాలా మందికి ఈ పిల్లకు తాగుడు అలవాటుందే అనుకుంటారు. కానీ అది అంతా అబద్ధం. నేను 24 గంటలూ జిమ్‌లోనే గడుపుతాను. అందువల్లే నా శరీర దృఢత్వం అలానే ఉంటుంది అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
see also : మరోసారి బయటపడ్డ మోగా బ్రదర్స్ మనస్పర్ధలు..!!
తనకు, మరో హీరోకు లింకుపెడుతూ రకుల్ ప్రేమలో ఉందంటూ ఓ సోషల్ మీడియా చెప్పుకొచ్చిందని, ఆ వార్తలన్నీ అవాస్తమని చెప్పింది. అయితే, రకుల్‌కు చేతిలో తెలుగునాట ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం. కోలీవుడ్‌లో రెండు, బాలీవుడ్లో ఒక చిత్రంలో నటిస్తోంది ఈ పంజాబీ బ్యూటీ రకుల్. మరి టాలీవుడ్లో ఈ భామకు ఛాన్స్ ఇచ్చే ఆ ప్రొడ్యూసర్ ఎవరో మరీ.