తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలోని తార్నాక లో లాలపెట్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పై త్వరలో 5.80 కోట్ల రూపాయలతో చేపట్టబోయే మరమ్మత్తు పనులను రాష్ట్ర ఆబ్కారీ శాఖ మాత్యులు పద్మారావు గౌడ్ గారితో కలిసి ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్, తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ పరిశీలించారు .తార్నాక కార్పొరేటర్ ఆలకుంట హరి సరస్వతి గార్లు తరువాత బ్రిడ్జి రిపేర్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
