జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం రిలీజ్‌కు ముందు 160 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని, టాలీవుడ్‌లో 20 శాతం అనే అసోసియేషన్ ఉందని, ఎవరైనా సినిమా వల్ల 20 శాతం నష్టపోతే 80 శాతం హీరోకానీ, డైరెక్టర్‌కానీ ఇవ్వాలనేది ఆ అసోసియేషన్ నిర్ణయించిందన్నారు. ఈ నిర్ణయం మేరకు మీరు ఎంత మంది డిస్ర్టిబ్యూటర్లకు ఇచ్చారండీ అంటూ పవన్ కల్యాణ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు నిర్మాత నట్టి కుమార్.
see also : బిగ్ బ్రేకింగ్: జగన్‌పై ఈడీ ఉత్తర్వులను కొట్టేసిన అప్పిలేట్ ట్రిబ్యునల్..!!
see also : బుల్లితెర బ్రేకింగ్: అంగరంగ వైభవంగా రష్మీ, సుధీర్‌ల వివాహం..!!
టాలీవుడ్ బఢా నిర్మాతలు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల ఛార్జీలు తగ్గించాలంటూ వారం రోజులపాటు థియేటర్లను బంద్ చేయాలంటూ నిర్ణయించారే తప్ప.. ఏ ఒక్క బఢా నిర్మాతైనా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమావల్ల నష్టపోయిన డిస్ర్టిబ్యూటర్లను ఆదుకునే ప్రయత్నం చేశారా..? అంటూ ప్రశ్నించారు. అజ్ఞాతవాసి చిత్రంవల్ల అప్పుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్‌లో ఓ డిస్ర్టిబ్యూటర్ కేవలం అజ్ఞాతవాసి చిత్రం వల్ల అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని నిర్మాత నట్టి కుమార్ గుర్తు చేశారు. 20 పర్సెంట్ అసోసియేషన్ నిర్ణయం మేరకు నష్టపోయిన డిస్ర్టిబ్యూటర్లకు డబ్బు తిరిగి ఇచ్చారా..? లేదా..? అన్న విషయాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికైనా చెప్పాలని డిమాండ్ చేశారు.
see