సినీతార పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 15వ తేదీన పూనమ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో రాజకీయాలపై విరుచుకుపడ్డారు. ఫేస్‌బుక్‌లో ఓ సంచలన పోస్టును పెట్టి మళ్లీ వివాదానికి తెరలేపింది. కాన్సెప్ట్స్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి.. బట్టలు మార్చినంత ఈజీగా మనుషులను మార్చేస్తూ రాజకీయాలు చేస్తున్నారంటూ.. పూనమ్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవని నెట్టింట చర్చ మొదలైంది. కాన్సెప్టులను కాపీకొట్టి.. వేష భాషలు మారుస్తూ జనాల్ని మభ్యపెట్టి అమ్మాయిలని అడ్డంపెట్టుకుంటూ కొంతమంది రాజకీయాలు చేస్తున్నారని.. ఆ భగవంతుడే నిజం ఏంటో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.
పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా పవన్ ప్రస్తావన తీసుకురాలేకపోయినా.. ప్రతి మాట పవన్‌ని ఉద్దేశించినవేనని ఆమె తరపు వర్గం, పవన్ వ్యతిరేక వర్గం ప్రచారం మొదలు పెట్టింది. ఇదిలా ఉంటే.. జనసేన ఆవిర్భావ మహాసభలో తన ప్రసంగం ద్వారా రాజకీయ వర్గాల్లో హీట్ పెంచేసిన పవన్ కల్యాణ్‌పై విమర్శల జోరు పెరిగింది. కానీ అధికార టీడీపీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఖండించింది. ప్రస్తుతం పూనమ్ కౌర్ కూడా పవన్ ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని.. తద్వారా పరోక్షంగా జనసేనానిపై విమర్శలు గుప్పించిందని పవన్ అభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.