ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఇటు తెలంగాణ అటు ఏపీ కి కల్పి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఈ ఎస్ ఎల్ నరసింహన్ వ్యవహరిస్తున్న సంగతి విదితమే .అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త గవర్నర్ రానున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాకి చెందిన ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఒక వార్త కథనాన్ని ప్రచురించింది .ఈ కథనంలో పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ను పంపాలనే ఆలోచనలో కేంద్ర సర్కారు ఉన్నట్లు ఆ పత్రిక తెల్పింది .అయితే ప్రస్తుతం జరుగుతున్నా పార్లమెంటు సంనావేశాల అనంతరం ఏపీ కి గవర్నర్ ను మార్చే ఆలోచనలో ఉన్నట్లు ముహూర్తం కూడా ప్రకటించేసింది ఆ పత్రిక ..
