ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ లేనోళ్ళు లేరంటే అతిశయోక్తి కాదేమో .అంతగా స్మార్ట్ ఫోన్ మానవ దైనందిన జీవితంలో భాగమైంది. అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు తమ ఫోన్లో వాట్సాప్ లేకుండా ఉండరు .అలాంటి వాళ్ళ కోసమే ఈ వార్త .వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అందులో భాగంగా టైం తో పాటుగా లొకేషన్ స్టిక్కర్లు ను పంపుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అంతకు ముందు యూజర్లు గూగుల్ మ్యాపింగ్ ద్వారా తామున్న లొకేషన్ ను పంపించుకునేవారు .ఇప్పుడు ఆ ఆవసరంలేకుండా ఫోటోలు వీడియోలు పంపుకునే ఆప్షన్ ను కల్పించింది. ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే అప్డేట్ చేసుకోండి ..
