Home / CRIME / రాత్రి 11 గంటలకు శ్రీరెడ్డిని వెంటాడిన పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్..!

రాత్రి 11 గంటలకు శ్రీరెడ్డిని వెంటాడిన పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్..!

జూబ్లీహిల్స్‌లోని ఓ టీవీ ఛానెల్‌ నిర్వహించే డిబెట్ లో పాల్గొనేందుకు శ్రీరెడ్డి వచ్చిన విషయం తెలుసుకొన్న పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్ అక్కడికి చేరుకుని ఉద్రిక్త పరిస్థితి సృష్టించారు. శ్రీరెడ్డి ఇంటికి వెళ్తుండగా వాహనాన్ని వెంబడిచారు. చివరికి పోలీసులు జోక్యంచేసుకుని ఆమెను ఇంటి వద్ద దిగబెట్టారు. మంగళవారం రాత్రి శ్రీరెడ్డి టీవీ కార్యాలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో ఆ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎస్సై సైదా తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారిని నియంత్రించారు. రాత్రి దాదాపు 11 గంటల ప్రాంతంలో ఆమెను కారులో మరో మార్గంలో ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు. ఇది గుర్తించిన పవన్‌ అభిమానులు కారును వెంబడించారు. ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ శ్రీరెడ్డిని నేరుగా జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తరువాత పోలీసు స్టేషన్ లో కాసేపు కూర్చోబెట్టి, తర్వాత పోలీసు వాహనంలో హుమాయన్‌నగర్‌ ఠాణా పరిధిలోని ఆమె ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఈ సంఘటనలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలిపెట్టారు.