ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు నారా లోకేష్ నాయుడు ,లోకేష్ మిత్రుడు కిలారు రాజేష్ కల్సి ఒక నటిని అడ్డుపెట్టుకొని నాపై కుట్రలు చేశారు. అందుకు పలు మీడియా సంస్థలకు పది కోట్ల మేర డీల్ ఒప్పందం చేస్కొని నాపై బురద చల్లుతున్నారు.ఒకానొక సమయంలో నన్ను చంపడానికి కుట్రలు కూడా చేస్తున్నారు అని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు మీడియా సంస్థల మెడకు చుట్టుకుంటున్నాయి. సినీ హీరోయిన్ గా చెలామణి అవుతున్న శ్రీరెడ్డి అనే మహిళ పవన్ కళ్యాణ్ తల్లిని తీవ్రంగా అవమానించేలా కామెంట్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ గత మూడు నాలుగు రోజులుగా రగిలిపోతున్నారు. శ్రీరెడ్డి తర్వాత పవన్ కు, ఆయన తల్లికి క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ ఈ ఇష్యూ ఇంకా రగులుతూనే ఉన్నది. శ్రీరెడ్డి వెనుక ఎవరెవరున్నారో వివరాలను శుక్రవారం ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లతో బయటపెట్టారు. టీవీ9 చానెల్ ఈ వ్యవహారంలో తెర వెనుక కుట్ర చేసిందని పవన్ ఆరోపించారు. అలాగే ఎబిఎన్ టీవీ అధిపతి వేమూరి రాధాకృష్ణ కూడా ఉన్నట్లు పవన్ ఆరోపించారు.దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉదయం పవన్ ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకోవడంతో ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఫిల్మ్ ఛాంబర్ వద్దకు వచ్చారు. అయితే ఇదే సమయంలో అక్కడ కవరేజీకి వచ్చిన ఎబిఎన్ టీవీ కారు అద్దాలను పవన్ ఫ్యాన్స్ పగలగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలో టీవీ 9 ఆఫీసు మీద పవన్ ఫ్యాన్స్ ఎటాక్ చేస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్ద సంఖ్యలో టీవీ9 ఆఫీసు చుట్టూ బలగాలు మొహరించారు.
