తెలంగాణలో ఇటీవలే కదా ఎన్నికలు ముగిసింది. మళ్లీ ఎన్నికల హాడావుడి ఏంటని ఆశ్చర్యపోతున్నారా..?. అయితే అసలు విషయం ఏంటంటే రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ పరిధిలో ఇటీవల ఖాళీ అయిన మూడు కార్పోరేట్ డివిజన్లకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి జీహెచ్ఎంసీ లేఖ రాయనున్నది.
నగరంలోని గుడిమల్కాపూర్ బీజేపీ కార్పోరేటర్ దేవర కరుణాకర్ మృతి చెందారు. శాస్త్రిపురం డివిజన్ కార్పోరేటర్ మహ్మద్ ముబిన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసి బహదూర్ పురా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మెహిదిపట్నం కార్పోరేటర్ మాజీద్ హుస్సేన్ కూడా నాంపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఖాళీ అయిన ఈ మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది.