ఒకటి కాదు రెండు కాదు ఎకంగా ఇరవై రెండు ఏళ్ళ పగను తీర్చుకున్నాడు కర్నాటక రాష్ట్ర గవర్నర్ వాజ్ భాయ్ .రెండు దశాబ్ధాల కింద తను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నారు వాజ్ భాయ్ .1996లో దేవేగౌడ ప్రధాన మంత్రిగా ఉన్నసమయంలో గుజరాత్ రాష్ట్రంలో సురేష్ మెహతా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం
పడిపోయింది.
దీంతో ప్రస్తుతం గవర్నర్ గా ఉన్న వాజ్ భాయ్ అప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.దీంతో మొట్ట మొదటిసారిగా సురేష్ మెహతా నేతృత్వంలోని సర్కారులో మంత్రి పదవి లభించింది.అయితే ఆ సమయంలో బీజేపీ పార్టీ నుండి నలబై మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళిన శంకర్ సింగ్ వాఘెలా కాంగ్రెస్ పార్టీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు
.ఆ ఆసమయంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను పెట్టాలని రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు సిఫార్స్ చేసిన దేవేగౌడ వాజ్ భాయ్ మంత్రి పదవిని మూడున్నాళ్ళ ముచ్చటగా మార్చారు.
అయితే అదే సమయంలో అప్పటి గవర్నర్ సైతం అత్యధిక మెజారిటీ ఉన్న బీజేపీ పార్టీకి బదులు ఆర్జేడీ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు .అయితే ఈ ప్రభుత్వం రెండేండ్ల పాటు కొనసాగింది .ఆ తర్వాత కాలంలో వాజ్ భాయ్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కానీ మంత్రి పదవి అందని ద్రాక్ష లా మిగిలిపోయింది .అయితే నాడు దేవేగౌడ చేసిన అవమానాన్ని నేడు ఇలా తీర్చుకున్నాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ..