కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి .ఒకసారి బీజేపీ వైపు గాలి మళ్ళితే మరోసారి కాంగ్రెస్ జేడీఎస్ వైపు వీస్తుంది.ఇప్పటికే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప తమదే ప్రభుత్వమని విశ్వాసం వ్యక్తం చేస్తుండగా మరోవైపు రాజకీయాల్లో ఏదైనా జరగోచ్చు అని కాంగ్రెస్ అండ్ కో విశ్వాసం వ్యక్తం చేస్తుంది .
ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర రాజకీయ వర్గాలకు సంబంధించి ప్రస్తుత విశ్వసనీయ సమాచారం మేరకు బీజేపీ పార్టీకి పదమూడు మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చారు .
దీని ప్రకారం .ఆనంద్ సింగ్(కాంగ్రెస్,హోస్పేట్) ,నాగేంద్ర(కాంగ్రెస్,బళ్లారి రూరల్) , జే.ఎన్. గణేష్(కాంగ్రెస్,కంప్ల),ప్రతాప్ గౌడ పాటిల్(కాంగ్రెస్,మస్కి),శివానంద్ పాటిల్ (కాంగ్రెస్,బాదాడు),ఎం.వై పాటిల్ (కాంగ్రెస్,అప్జల్ పూర్),నాగన్ గౌడ (జేడీఎస్ ,గురుత్కల్) ,వేంకటరమణప్ప(కాంగ్రెస్,పావగడ),సి.పుట్టరంగశెట్టి(చామరాజనగర్),కే.ఎస్.లింగేష్(జేడీఎస్,బేలూరు),శివరాం హెర్బల్(ఎల్లాపూర్ మున్గాడ్),రాజశేఖర్ పాటిల్(హుమ్నాబాద్),దేవేంద్ర చౌహాన్ (జేడీఎస్,నగ్తాన్)వీరంతా బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చారని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో గుస గుస లాడుకుంటున్నారు.